రేపు 7H MPL సీజన్-2 ట్రోఫీ ఆవిష్కరణ

by  |
రేపు 7H MPL సీజన్-2 ట్రోఫీ ఆవిష్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: నందిని టైర్స్ స్పాన్సర్స్‌గా వ్యవహారిస్తున్న 7H మీడియా ప్రీమియర్ లీగ్ సీజన్ -2 జెర్సీతో పాటు ట్రోఫీని శుక్రవారం ఆవిష్కరించనున్నట్టు ఫౌండర్, డైరెక్టర్ వెంకటేశ్ తెలిపారు. గురువారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. రోజు వారి పనుల్లో బిజీగా ఉండే.. జర్నలిస్టులకు నిర్వహించే క్రికెట్ పోటీలు వారి మానసిక ఉల్లాసానికి తోడ్పాటునందిస్తాయన్నారు. ఈ టోర్నీలో మొత్తంలో 16 జట్లు పాల్గొంటున్నాయని ఇందులో 8 ఎలక్ట్రానిక్, 7 ప్రింట్, 1 ప్రెస్ క్లబ్‌‌ టీమ్‌లు ఉన్నాయని తెలిపారు. టోర్నమెంట్‌లో భాగంగా.. శుక్రవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ట్రోఫీ, జెర్సీ, షెడ్యూల్‌లను ఆయా జట్ల కెప్టెన్ల సమక్షంలో ఆవిష్కరించనున్నట్టు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన ఆటగాడికి EVOLET COMPANY ఎలక్ట్రిక్ స్కూటర్ అందజేయనున్నట్టు స్పష్టం చేశారు.


Next Story