టాలీవుడ్ వాలెంటైన్స్ డే..లవ్లీ అండ్ మెలోడి ట్రీట్

by  |
టాలీవుడ్ వాలెంటైన్స్ డే..లవ్లీ అండ్ మెలోడి ట్రీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నుంచి వాలెంటైన్స్ డే ట్రీట్స్ వచ్చేశాయి. అప్ కమింగ్ మూవీస్ నుంచి స్పెషల్ లవ్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ పాటల ద్వారా తమ పార్ట్‌నర్స్‌కు లవ్ ఎక్స్‌ప్రెస్ చేసుకునే విధంగా ప్లాన్ చేసిన పలు మూవీ యూనిట్స్.. ప్రేమికుల రోజు సందర్భాన్ని క్యాచ్ చేసుకుంటూ మెలోడి పాటలు విడుదల చేశాయి.‘టక్ జగదీష్’ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌‌లర్’ సినిమాల నుంచి లవ్ అండ్ మెలోడి సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.

టక్ జగదీష్..ఇంకోసారి ఇంకోసారి

నేచురల్ స్టార్ నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘టక్ జగదీష్’ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. థమన్ మ్యూజికల్‌లో వచ్చిన ‘ఇంకోసారి ఇంకోసారి’ అంటూ సాగే పాటను శ్రీయా ఘోషల్, కాల భైరవ పాడగా..థమన్ ఖాతా నుంచి వచ్చిన మరో మెలోడి సాంగ్ ఆకట్టుకుంటోంది. నాని, రీతు కాంబినేషన్‌లో వచ్చిన పాట అన్ని రికార్డులు చెరిపేయాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా.. తనను ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొచ్చి హ్యాపీగా ఉంచేందుకు ప్రయత్నించిన ప్రేమికుడు పిలిచే పిలుపు గురించి, తనను ఎలా చూసుకుంటాడో వివరిస్తూ సాగే ఈ పాటకు చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ‘టక్ జగదీష్’ చిత్రాన్ని శైన్ స్క్రీన్స్ నిర్మిస్తోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. గులాబి గుచ్చె
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, వాసు వర్మ నిర్మిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి ప్రేమికుల రోజు కానుకగా ‘గుచ్చె గులాబి’ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందించగా..అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాటకు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ కాన్సెప్ట్‌‌లో హీరోయిన్‌ను చూడగానే ప్రేమలో పడిపోయిన హీరో పాడుకునే పాటకు అనంత శ్రీరామ్, శ్రీమణి లిరిక్స్ అందించారు.


Next Story

Most Viewed