గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంపై టాలీవుడ్ నిర్మాత ఫైర్.. మెగా ఫ్యామిలీని టార్గెట్‌గా షాకింగ్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-16 06:22:55  IST  )

తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్‌ అవార్డుల ప్రధానోత్సవం శనివారం హైటెక్స్‌ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంపై టాలీవుడ్ నిర్మాత ఫైర్.. మెగా ఫ్యామిలీని టార్గెట్‌గా షాకింగ్ ట్వీట్
X

దిశ, సినిమా: తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్‌ అవార్డుల ప్రధానోత్సవం శనివారం హైటెక్స్‌ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ వేడుకకు ఎంతో మంది స్టార్స్ హాజరై అవార్డులు సొంతం చేసుకున్నారు. తాజాగా, ఈ వేడుక గురించి టాలీవుడ్ నిర్మాత అహితేజ సంచలన ట్వీట్ పెట్టి వార్తల్లో నిలిచారు. అయితే ఓ నెటిజన్ ‘రంగస్థలం’ సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు రాకపోవడంపై మీ అభిప్రాయం చెప్పండి అని అడిగిన ప్రశ్నకు ఆయన షాకింగ్ పోస్ట్ పెట్టారు.

‘‘అవార్డు వస్తే మనకు సర్‌ప్రైజ్ అవుతుంది. అప్పట్లో ‘మగధీర’(Magadheera) సినిమాకు కూడా ఇవ్వలేదు.. ఇప్పుడు ‘రంగస్థలం’ (Rangasthalam) కు కూడా రాలేదు. చాలా పెద్ద సర్‌ప్రైజ్ ఏంటంటే.. 2019లో ఒక తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ ‘సైరా’ చిత్రానికి మూడు క్యాటగిరీస్‌లో ఎక్కడ ఇవ్వలేదు. జ్యూరికీ మన సినిమాలు కనపడవు. మీ గురించి ఇండస్ట్రీలో ఫైట్ చేసే వాడు లేడు మీ పక్కన. మళ్లీ మీరు కొంతమందిని తొక్కేయడం, మాఫియా అని ఈ బిరుదులు ఎందుకు’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా చిరంజీవి, రామ్ చరణ్ పేర్లను జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇక అది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, అహితేజ జ్యూరి అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటన విడుదల చేసినప్పుడు కూడా ఇలాగే స్పందించిన విషయం తెలిసిందే. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. నందితా శ్వేతా ప్రధాన పాత్రలో నటించిన 'అక్షర' సినిమాను అహితేజ బెల్లంకొండ ప్రొడ్యూస్ చేశారు. రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా ఆయన నిర్మించిన 'శశివదనే' విడుదలకు రెడీ అవుతోంది.

twitter link

Next Story