పెళ్లి వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రియమణి.. డబ్బులకోసమే

by Shyam |   (  Updated:2021-07-23 01:11:54  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి పెళ్లి వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రియమణి, ముస్తాఫా రాజ్‌ల వివాహం చెల్లదంటూ ఆయన మొదటి భార్య అయేషా సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రియమణి వ్యాపారవేత్త ముస్తఫారాజ్ ను 2017లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే అతనికి అయేషా అనే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2010 నుంచి వారు విడిగా [&hellip;]</p>

movie news
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి పెళ్లి వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రియమణి, ముస్తాఫా రాజ్‌ల వివాహం చెల్లదంటూ ఆయన మొదటి భార్య అయేషా సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రియమణి వ్యాపారవేత్త ముస్తఫారాజ్ ను 2017లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే అతనికి అయేషా అనే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2010 నుంచి వారు విడిగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే ప్రియమణి, ముస్తఫాను ప్రేమించి పెళ్లిచేసుకుంది. అయితే.. కొన్ని రోజులుగా ముస్తఫా మొదటి భార్య వీరిపెళ్లిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.”తానూ ఇప్పటివరకు ముస్తఫాకు విడాకులు ఇవ్వలేదని, తన భర్తతో ప్రియమణికి జరిగిన వివాహం చెల్లదని” ఆరోపణలు చేసింది. ఇక తాజాగా ఈ వ్యాఖ్యలపై ప్రియమణి స్పందించింది.

తమ వివాహంపై వస్తున్నవన్నీ పుకార్లేనని తేల్చి చెప్పిన ప్రియమణి ముస్తాఫా లాంటి భర్త దొరకడం అదృష్టమని తెలిపింది. ప్రస్తుతం తన భర్త ముస్తఫా విదేశాల్లో ఉన్నారని, మేమిద్దరం మా బంధంలో ఎంతో అన్యోన్యంగా ఉన్నామని తెలిపింది. తమది చట్టవిరుద్ధ సంబంధం కాదని, మా బంధానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని అని స్పష్టం చేసింది.

ఇక అటు ముస్తాఫా రాజ్ కూడా ఈ విషయంపై స్పందించారు. అయేషా చేస్తున్న వ్యాఖ్యలన్నీ ఆరోపణలని, తాను పిల్లల సంరక్షణ కోసం ప్రతినెలా డబ్బులు పంపిస్తూనే ఉన్నట్టు చెప్పాడు. అది వాస్తవం కాకపోతే.. ఇప్పటి వరకూ ఆమె ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించాడు. ఆమె తన నుంచి ఇంకా ఎక్కువ డబ్బులు ఆశించే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని తెలిపారు.

Follow Disha Cinema official Facebook page: https://www.facebook.com/Dishacinema
Next Story