మేకప్ లేకుండా స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టడం కష్టమంటున్న నెటిజన్స్

by  |
మేకప్ లేకుండా స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టడం కష్టమంటున్న నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ రంగు వేసుకోకపోతే ఎవరూ గుర్తు పట్టరు. ఇక ఫేడ్ అవుట్ అయినా నటీనటులను జనాలు మర్చిపోతూ ఉంటారు. ఈ రంగుల ప్రపంచంలో హీరోయిన్లది ప్రత్యేక స్థానం. ఎప్పుడు తమ అందాన్ని కాపాడుకొంటూ ఉండాలి. దాని కోసం యోగాలు, జిమ్ లు చేస్తూ ఉండాలి. బయటికి వెళ్లినా మేకప్ తోనే వెళ్లాలి.. లేకపోతే ఫ్యాన్స్ గుర్తుపట్టరు. ఇక కొంతమంది హీరోయిన్లు అందం అంటే మేకప్ తో వచ్చేది కాదని.. అందం అంటే ఆత్మ సౌందర్యం అంటూ తమ ఒరిజినల్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక తాజాగా గోవా బ్యూటీ ఇలియానా కూడా విత్ అవుట్ మేకప్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ గా మారింది.

ప్రియుడితో బ్రేక్ అప్ అయిన తరువాత ఇలియానా సినిమాలకు కొంత గ్యాప్ ఇవ్వడమే కాకుండా లావు కూడా పెరిగింది. ఆ తరువాత ఆ బాధలో నుంచి బయటకి వచ్చి బరువు తగ్గడంతో పాటు మునుపట రూపంకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమ్మడు స్లిమ్ అయిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా పోస్ట్ చేసిన ఈ పిక్ లో హాట్ బ్యూటీ మునుపటి రూపానికి వచ్చినట్లు కనిపిస్తున్నా.. మేకప్ లేకపోవడంతో ఈమెను గుర్తుపట్టే అవకాశమే లేదంటున్నారు నెటిజన్లు.

ఏంటీ.. ఈమె ఇలియానానా.. కెమెరా టాప్ యాంగిల్ నుంచి చూసి ఎవరో అనుకున్నాం అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరికి నిజంగానే అదే డౌట్ వస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈ పిక్ కి ఇల్లూ బేబీ ‘నో మేకప్.. నో ఫిల్టర్స్.. నాచురల్ ఫొటో’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇలియానా కొన్ని హిందీ చిత్రాల్లో నటిస్తుంది. మరి ఇంత కష్టపడి బక్కచిక్కిన ఈ భామకు తెలుగులో అవకాశాలు వస్తాయో ..? లేదో..? చూడాలి.


Next Story