నేడే దిల్ రాజు రెండో పెళ్లి

by  |
నేడే దిల్ రాజు రెండో పెళ్లి
X

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి నిజామాబాద్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకోనున్నారు. ప‌దిమంది లోపు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి దిల్‌రాజు ఓ నోట్‌ కూడా విడుదల చేశారు. గత కొన్నాళ్లుగా ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులు, వృత్తిపరమైన ఇబ్బందులు అందరికీ తెలిసిందేనని అన్నారు. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ కూడా అంత గొప్పగా లేదని చెప్పారు. రెండో పెళ్లితో అంతా సర్దుకుంటుదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ కొత్త మ‌లుపుతో వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఆనంద‌మ‌యం చేసుకోవాలని దిల్ రాజు వెల్ల‌డించారు.

Next Story

Most Viewed