ధూమపానానికి తప్పదు భారీ మూల్యం

330

దిశ వెబ్‌డెస్క్: ‘ధూమపానంకి దూరంగా ఉండండి.. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం’ అంటూ ఎంత అవగాహాన కల్పించినా.. పొద్దున లేవగానే సిగరెట్ తాగే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. యువత యుక్త వయస్సుల్లోనే ధూమపానం బారిన పడి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. యుక్త వయస్సుల్లో సరదాగా మొదలుపెట్టిన ధూమపానం అలవాటుగా మారి, ఆ తర్వాత వ్యసనంలా మారుతోంది.

ధూమపానంతో ఎంతోమంది వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా ధూమపానంను దూరం చేసుకోండి. నేడు ధూమాపాన వ్యతిరేకం దినోత్సవం సందర్భంగా ‘నో స్మోకింగ్’ అంటూ ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముంది.

ప్రతి ఏడాది మార్చి నెల రెండో బుధవారం నో స్మోకింగ్ డేను నిర్వహించారు. 1984లో ఫస్ట్ స్మోకింగ్ డే నిర్వహించారు. పొగతాగేవారిని మానిపించడంతో పాటు దాని వల్ల వచ్చే అనర్థాలపై అవగాహాన కల్పించేందుకు ‘నో స్మోకింగ్ డే’ ప్రవేశపెట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..