- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యాపేటలో కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు
by B.Srinivas |
<p>దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో గురువారం ఒక్కరోజే 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రకటించారు. దీంతో ఇటు ప్రజలు.. అటు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్త కేసుల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే 14 కేసులు నమోదు కావడం గమనార్హం. వీరంతా ఇటీవల కొత్తగూడెం బజారులో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి బంధువులుగా అధికారులు తేల్చారు. కాగా, మిగిలిన రెండు కేసులు ఇప్పటికే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తుల నుంచి […]</p>
దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో గురువారం ఒక్కరోజే 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రకటించారు. దీంతో ఇటు ప్రజలు.. అటు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్త కేసుల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే 14 కేసులు నమోదు కావడం గమనార్హం. వీరంతా ఇటీవల కొత్తగూడెం బజారులో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి బంధువులుగా అధికారులు తేల్చారు. కాగా, మిగిలిన రెండు కేసులు ఇప్పటికే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తుల నుంచి సోకినట్లు తెలిపారు. కొత్త కేసులతో కలిపి సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరుకుంది.
Tags: collector statement, 16 Corona Positive Cases, suryapet
Next Story






