- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫేక్ వ్యాక్సిన్ తీసుకున్న ఎంపీ ఏమన్నారో తెలుసా..!
<p>కోల్‌కతా: నకిలీ టీకా తీసుకున్న టీఎంసీ ఎంపీ మిమీ చక్రవర్తి శుక్రవారం స్పందించి తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, భయపడాల్సిన పనిలేదని వివరించారు. కోల్‌కతాలో మంగళవారం నిర్వహించిన ఓ నకిలీ వ్యాక్సినేషన్ క్యాంపులో సుమారు 250 మంది వరకు టీకా తీసుకున్నారు. నిందితుడు దేవాంజన్ దేవ్ కలెక్టర్‌గా మోసం చేసి మిమీ చక్రవర్తినే ఆ నకిలీ క్యాంపునకు చీఫ్ గెస్ట్‌గా తీసుకెళ్లారు. టీకా సర్టిఫికేట్ రాకపోవడంపై మిమీ చక్రవర్తి అనుమానం ఈ నకిలీ ముఠాను బట్టబయలు చేయడానికి […]</p>

కోల్‌కతా: నకిలీ టీకా తీసుకున్న టీఎంసీ ఎంపీ మిమీ చక్రవర్తి శుక్రవారం స్పందించి తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, భయపడాల్సిన పనిలేదని వివరించారు. కోల్‌కతాలో మంగళవారం నిర్వహించిన ఓ నకిలీ వ్యాక్సినేషన్ క్యాంపులో సుమారు 250 మంది వరకు టీకా తీసుకున్నారు. నిందితుడు దేవాంజన్ దేవ్ కలెక్టర్‌గా మోసం చేసి మిమీ చక్రవర్తినే ఆ నకిలీ క్యాంపునకు చీఫ్ గెస్ట్‌గా తీసుకెళ్లారు. టీకా సర్టిఫికేట్ రాకపోవడంపై మిమీ చక్రవర్తి అనుమానం ఈ నకిలీ ముఠాను బట్టబయలు చేయడానికి దోహదపడింది. ఆమె ఆరోగ్యంపై ఆందోళనలు వెలువడటంతో స్పందిస్తూ తాను బాగానే ఉన్నారని, తనతోపాటు ఆ క్యాంపులో పాల్గొన్నవారంతా బాధితులేనని వివరించారు. అయితే, ఆందోళనపడాల్సిందేమీ లేదని, అధికారులు ఆ నకిలీ టీకాలను పరిశీలించారని, హానీకారకాలేవీ లేవని తెలిపారని చెప్పారు. ఆ క్యాంపులో పాల్గొన్నవారంతా కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ లేదా సమీపంలోని కౌన్సిలర్‌ను సంప్రదించాలని సూచించారు.
- Tags
- Fake vaccine






