- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీపీఐ నారాయణ కాలు పట్టుకున్న వైసీపీ ఎంపీ.. ప్రశంసించిన అభిమానులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, డైనమిక్ బ్యూరో : అకాల వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రాయల చెరువును పరిశీలించేందుకు వెళ్లిన సీపీఐ నారాయణ గాయపడ్డారు. ఆయన కాలుకు గాయం కావడంతో నడిచేందుకు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి వెంటనే నారాయణ వద్దకు చేరుకున్నారు. వృత్తిరీత్యా గురుమూర్తి వైద్యుడు కావడంతో నారాయణకు ప్రథమ చికిత్స చేశారు. ఆయన కాలును […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : అకాల వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రాయల చెరువును పరిశీలించేందుకు వెళ్లిన సీపీఐ నారాయణ గాయపడ్డారు. ఆయన కాలుకు గాయం కావడంతో నడిచేందుకు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి వెంటనే నారాయణ వద్దకు చేరుకున్నారు. వృత్తిరీత్యా గురుమూర్తి వైద్యుడు కావడంతో నారాయణకు ప్రథమ చికిత్స చేశారు. ఆయన కాలును తన తొడపై పెట్టుకుని మరీ వైద్యం చేశారు. ఆ దృశ్యాన్ని చూసిన వైసీపీ, సీపీఐ నాయకులు ఎంపీ గురుమూర్తిని ప్రశంసించారు. ప్రస్తుతం గురుమూర్తి చికిత్స చేస్తున్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
Next Story






