శవాలతో బేరం.. రూ.5 వేలు ఇస్తేనే..!

89
tirupathi ruia hospital

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. మరోవైపు అంతే స్థాయిలో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుపతిలో కొవిడ్ తీవ్రత మమూలుగా లేదు. అక్కడి ఆస్పత్రులన్నీ కొవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. సరిపడా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మరో దారుణం వెలుగుచూసింది.

కరోనా బారిన పడి మృతి చెందిన మృతదేహాలను వారి బంధువులకు అప్పజెప్పేందుకు మార్చురీ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో డెడ్ బాడీకి రూ.5వేలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మార్చురీ సిబ్బందిపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు బాధితులు రుయా ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మృతదేహాల కోసం బంధువులే బయట నుంచి ఫ్రీజర్లు తెచ్చుకుంటున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..