టీకాల మధ్య ఎడం పెంచితే ముప్పే

48

న్యూఢిల్లీ: టీకా డోసుల మధ్య ఎడం పెంచితే తొలి డోసు తీసుకున్నవారూ వేరియంట్ల బారినపడే ముప్పు ఉంటుందని అమెరికా అధ్యక్షుడి వైద్య సలహాదారుడు, అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ తెలిపారు. టీకా సరఫరాలు తక్కువగా ఉంటే ఈ నిర్ణయం తీసుకోవడం తప్పకపోవచ్చుననీ పేర్కొన్నారు. అలాగే, కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నవారూ టీకా తీసుకోవడంపై అలక్ష్యం చేయవద్దని, వారూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. టీకా డోసుల మధ్య వ్యవధిని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి రెండు సార్లు పెంచుతూ నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

మార్చి నెలలో రెండు డోసుల మధ్య వ్యవధిని 28 రోజుల నుంచి 6-8 వారాలకు పెంచగా, తర్వాత దానిని 12-16(కొవిషీల్డ్) వారాలకు పెంచింది. ఎంఆర్ఎన్ఏ టీకాలకైతే ఫైజర్ డోసులను మూడు వారాల వ్యధలోనే మొడెర్నా డోసులను నాలుగు వారాల గడువులో తీసుకోవాలని డాక్టర్ ఫౌచీ తెలిపారు. యూకేలో డోసుల వ్యవధిని పెంచడంతో వేరియంట్ల బారినపడ్డవారిని చూశామని చెప్పారు. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నదని, దీని అడ్డుకట్టకు టీకా ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరముందని అన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..