ప్రపంచ ఆరోగ్య సంస్థ నిధికి టిక్‌టాక్ సాయం

by  |
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిధికి టిక్‌టాక్ సాయం
X

దిశ, వెబ్‌డెస్క్: నోవెల్ కరోనా వైరస్ కట్టడిలో భాగంగా నిరంతరం శ్రమిస్తోన్న వైద్యులకు సాయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి సొలిడిటరీ రెస్పాన్స్ ఫండ్ కోసం టిక్‌టాక్ సంస్థ 10 మిలియన్ల డాలర్లను విరాళంగా ప్రకటించింది. ఈ విషయాన్ని టిక్‌టాక్ ప్రెసిడెంట్ అలెక్స్ జు ఓ బ్లాగు పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి కష్టసమయాల్లో తమ కుటుంబాలకు దూరంగా వ్యాధిగ్రస్తుల ప్రాణాలను కాపాడటానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్న వైద్యులకు, ఆసుపత్రులకు సిబ్బందికి తాము రుణపడి ఉన్నామని, వారికి సాయంగా పది మిలియన్ల డాలర్లు విరాళం ప్రకటించనున్నట్లు అలెక్స్ బ్లాగు పోస్టులో పేర్కొన్నారు.

ఈ నగదు విరాళంతో పాటు అవసరమైన దేశాలకు మెడికల్ పరికరాలు, మెడిసిన్ అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కరోనా ప్రభావంతో పూటగడవని పరిస్థితి ఉన్న కుటుంబాలకు సాయం చేయడానికి ఆఫ్టర్ స్కూల్ ఆల్ స్టార్స్‌తో టిక్ టాక్ పనిచేస్తోంది. ఇందుకోసం 3 మిలియన్ డాలర్లను సాయంగా అందించింది. ఇంకా తమ ప్లాట్‌ఫాం ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ, రెడ్‌క్రాస్‌తో కలిసి కరోనా గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

Tags : WHO, Solidarity fund, Red cross, TikTok, Alex Zhu


Next Story

Most Viewed