వెండితెరపై టిక్ టాక్ దుర్గారావు..

by  |
వెండితెరపై టిక్ టాక్ దుర్గారావు..
X

దిశ, వెబ్‌డెస్క్ : టిక్ టాక్ స్టార్, యూట్యూబ్ సెన్సేషన్ దుర్గారావు.. వెండితెరపై మెరవబోతున్నాడు. డైరెక్టర్ గోపిచంద్ మలినేని, మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్‌లో వస్తోన్న ‘క్రాక్’ మూవీలో తను నటించినట్లు స్వయంగా దుర్గారావు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. దీంతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలుగు తెర మీద మంచిపాత్రలు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ ఒక్క సినిమానే కాదు.. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుతున్నారు.

టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన దుర్గారావుకు.. ఆయన భార్యతో కలిసి వేసిన స్టెప్పులు మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ‘ఢీ’ డ్యాన్స్ షోలో డ్యాన్సర్ పండు చేసిన నక్కిలీసు గొలుసు పాటకు దుర్గారావు సిగ్నేచర్ స్టెప్పుల్ని వాడటంతో ఆయన ఫేమ్ ఇంకా పెరిగిపోయింది. కాగా యూట్యూబ్‌ను షేక్ చేసిన ఈ పెర్ఫార్మెన్స్.. మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దుర్గారావు బుల్లితెరపై ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షోలోనూ కనిపించగా.. ప్రజెంట్ వెండితెర మీద కనిపించబోతున్నాడు.


Next Story