- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
దిశ, వెబ్ డెస్క్ :
పెద్దపులుల సంరక్షణకు భారత్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. ప్రతియేటా పులుల సంతానోత్పత్తి పెరుగుదల గణన కూడా చేపడుతోంది. అయితే, ప్రపంచంలోనే 70శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయని ఈ మధ్యే కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే పులుల సంతానోత్పత్తికి అనువైన ప్రాంతాన్ని పర్యావరణ శాఖ గుర్తించింది. ఆ ప్రాంతంలో పులుల సంతానోత్పత్తి గణనీయంగా పెరిగిందని తాజా రికార్డులు వెల్లడించాయి. అది మరెక్కడో కాదు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ప్రాంతం.
దట్టమైన అటవీ ప్రాంతం, చుట్టూ కొండలు, లోయలు, సహజ సిద్ధమైన నీటి వనరులు, గలగల పారే జలపాతాలు, పచ్చిక బైళ్లు, శాఖాహార జంతువులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. పైగా ఓ వైపు మహారాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ కేంద్రం, కవ్వాల్ అటవీ ప్రాంతాలు అనుకుని ఉండటంతో ఉత్తర, దక్షిణ భారతదేశాల నుంచి పులులు విరివిగా రాకపోకలు సాగిస్తుంటాయి. అక్కడే హాయిగా సేదతీరుతున్న పెద్దపులులు ఆ ప్రాంతాన్ని తమ సంతానోత్పత్తకి అనువుగా మార్చుకుంటున్నాయని తేలింది.