సముద్ర అలలకు ఎదురెళ్లిన అందాల బ్యూటీ.. వీడియో వైరల్

by  |
సముద్ర అలలకు ఎదురెళ్లిన అందాల బ్యూటీ.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పఠాని తాజాగా బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ తన నాజూకు అందాలతో అభిమానుల మతిపోగొడుతోంది. ఇందుకు సంబంధించిన కొన్ని హాట్ ఫొటోలు, వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దిశ ముఖంపై రవికిరణాలు పడుతుంటే.. తను రెండు చేతులతో ప్రకృతిని ఆస్వాదిస్తూ, తన అందాల్ని ఆరబోస్తూ.. చిన్న స్కర్ట్‌లో ఎదురొస్తున్న అలల్లోకి నడుచుకుంటూ వెళ్తున్న ఈ వీడియో చూస్తే ఫిదా కావాల్సిందే. అలాగే మరో పిక్‌లో ఎలాంటి మేకప్ లేకుండా.. క్రీమ్ కలర్ ఫ్లోరల్ డ్రెస్ ధరించి, జుట్టు వదిలేసి ఏకాంతంగా ఆకాశంలో తెల్లటి మబ్బులవైపు చూస్తున్న పిక్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆమె అందాలను వర్ణిస్తున్న నెటిజన్లు.. సూపర్బ్, లవ్లీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక దిశా పఠాని ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న ‘ఏక్ విలన్ రిటర్న్స్’ మూవీతో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది.

https://www.instagram.com/reel/CWP2FyNlDZc/?utm_source=ig_web_copy_link



Next Story

Most Viewed