దిశా పఠానీకి బాయ్ ఫ్రెండ్ స్పెషల్ విష్

by Shyam |   (  Updated:2020-06-13 05:34:09  IST  )

<p>బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘దిశా పఠానీ’ బర్త్ డే సందర్భంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తనకు స్పెషల్ విషెస్ అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్, ఫ్యాన్స్ నుంచి కూడా ఈ మలాంగ్ బ్యూటీకి విషెస్ అందుతుండగా.. తన బాయ్ ఫ్రెండ్ ‘టైగర్ ష్రాఫ్’ చాలా స్పెషల్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం. టైగర్, దిశ.. చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా దిశా బర్త్‌డేను చాలా స్పెషల్‌గా ఉంచేందుకు తను జాయ్ ఫుల్‌గా ఉన్న వీడియోను [&hellip;]</p>

దిశా పఠానీకి బాయ్ ఫ్రెండ్ స్పెషల్ విష్
X

బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘దిశా పఠానీ’ బర్త్ డే సందర్భంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తనకు స్పెషల్ విషెస్ అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్, ఫ్యాన్స్ నుంచి కూడా ఈ మలాంగ్ బ్యూటీకి విషెస్ అందుతుండగా.. తన బాయ్ ఫ్రెండ్ ‘టైగర్ ష్రాఫ్’ చాలా స్పెషల్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం.

టైగర్, దిశ.. చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా దిశా బర్త్‌డేను చాలా స్పెషల్‌గా ఉంచేందుకు తను జాయ్ ఫుల్‌గా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గర్ల్ ఫ్రెండ్‌కు బెస్ట్ విషెస్ అందించాడు టైగర్ ష్రాఫ్. ‘హోటల్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియోలో ఎంత హ్యాపీగా ఉందో.. అంతే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే రాక్ స్టార్’ అంటూ హార్ట్‌ఫుల్ అండ్ బ్యూటిఫుల్ విషెస్ అందించాడు. దీనికి ‘థ్యాంక్ యూ సూపర్ స్టార్’ అని తెలిపింది దిశ. ఇక ‘3 వాఫుల్స్, 3 పాన్‌‌కేక్స్’ బర్త్ డే ట్రీట్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపాడు టైగర్ ష్రాఫ్. అతడి సోదరి కృష్ణ ష్రాఫ్ కూడా ‘ఎప్పటికీ అందమైన దిశకు పుట్టినరోజు శుభాకంక్షలు’ అని విష్ చేసింది.

View this post on Instagram

3 waffles and 3 pancakes later 😂…happy birthday rockstar❤️ @dishapatani

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ సైతం తనదైన శైలిలో దిశా పఠానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ‘ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలని కోరుకున్న అనిల్.. నీకు ప్రతీ రోజూ మలంగ్ డే కావాలని ఆకాంక్షించాడు. పని మీద మరింత ఫోకస్ చేస్తూ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకున్నాడు.

Next Story