- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నో టిక్‌టాక్..
<p> పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో టిక్‌టాక్ వీడియోల చిత్రీకరణను నిషేధిస్తూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. పవిత్రమైన సిక్కు మందిరమైన స్వర్ణ దేవాలయంలో అభ్యంతరకరమైన టిక్‌టాక్ వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అఖల్ తఖ్త్ జాతేదార్ జియానీ హర్ ప్రీత్ సింగ్ చెప్పారు. ఆలయ పరిధిలో టిక్‌టాక్ వీడియోలు నిషేధమంటూ గోడలపై పోస్టర్లు అతికించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన […]</p>

పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో టిక్‌టాక్ వీడియోల చిత్రీకరణను నిషేధిస్తూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. పవిత్రమైన సిక్కు మందిరమైన స్వర్ణ దేవాలయంలో అభ్యంతరకరమైన టిక్‌టాక్ వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అఖల్ తఖ్త్ జాతేదార్ జియానీ హర్ ప్రీత్ సింగ్ చెప్పారు. ఆలయ పరిధిలో టిక్‌టాక్ వీడియోలు నిషేధమంటూ గోడలపై పోస్టర్లు అతికించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కాగా, ఆలయంలో టిక్‌టాక్ వీడియోలు చిత్రీకరణ జరగకుండా చూసేందుకు వాలంటీర్లను కూడా నియమించారు. అలాగే వీడియాలు తీస్తున్న వారిపై చీఫ్ మేనేజరు జస్వీందర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా మొబైల్ వినియోగాన్ని ఆలయ పరిధిలో నిషేధిస్తామని అఖల్ తఖ్త్ హెచ్చరించింది.






