- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టికెట్లు దగ్గర ఉంచుకోండి: ఐసీసీ
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వాయిదా పడటంతో ఇప్పటికే టికెట్లు కొన్న ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై ఐసీసీ స్పష్టతనిచ్చింది. 2021, 2022ల్లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వేదికలను ఇంకా నిర్ణయించలేదని, ఒకవేళ వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలోనే టీ20 వరల్డ్ కప్ నిర్వహిస్తే ఇవే టికెట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. 2022లో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తే ఈ టికెట్లు చెల్లుబాటు కావని, టికెట్లకు […]</p>

X
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వాయిదా పడటంతో ఇప్పటికే టికెట్లు కొన్న ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై ఐసీసీ స్పష్టతనిచ్చింది. 2021, 2022ల్లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వేదికలను ఇంకా నిర్ణయించలేదని, ఒకవేళ వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలోనే టీ20 వరల్డ్ కప్ నిర్వహిస్తే ఇవే టికెట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. 2022లో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తే ఈ టికెట్లు చెల్లుబాటు కావని, టికెట్లకు సరిపడా రుసుంను తిరిగి చెల్లిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన పొట్టి ప్రపంచకప్‌ను వచ్చే ఏడాదికి ఐసీసీ సోమవారం వాయిదా వేసింది. 2021,2022ల్లో వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లను నిర్వహిస్తామని తెలిపింది.
Next Story






