గుడ్‌న్యూస్.. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు

by  |
Panchangam
X

తేది : 26, ఆగష్టు 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : గురువారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చవితి
(నిన్న సాయంత్రం 4 గం॥ 24 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 18 ని॥ వరకు)
నక్షత్రం : రేవతి
(నిన్న రాత్రి 8 గం॥ 53 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 10 గం॥ 33 ని॥ వరకు)
యోగము : గండము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 9 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 25 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 7 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 41 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 2 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 3 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 25 ని॥ వరకు)

మేష రాశి: ధైర్యము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. నిరాశావాదం వదిలిపెట్టండి వ్యాపారులకు లాభాలు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారులకు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వారితో పరుషంగా మాట్లాడకండి వారు హర్ట్ అయ్యే అవకాశం. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. పనులు పెండింగ్ పడకుండా తప్పులు జరగకుండా చూసుకోండి. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి ముఖ్యంగా బిపి పేషెంట్లు. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి నమ్మకమే మీ వైవాహిక జీవితానికి పునాది.

వృషభ రాశి: ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. అదృష్టం మీ పక్షాన ఉంది. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. చాలా కాలం నుండి ప్రయత్నిస్తున్న రుణము చేతికందుతుంది. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు అందరు ప్రశంసలు. సహనంతో ప్రవర్తించండి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు . ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మిధున రాశి: మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. గందరగోళం లో సరైన ఆలోచనలు రావు. దాని వలన మానసిక శాంతి తద్వారా రోగం. వ్యాపారులు తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచించుకోవాలి. ఆఫీసు పనులలో మీ సామర్ధ్యము పని నిబద్ధత పై అందరి ప్రశంసలు ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు పాత విషయాలను మరిచిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

కర్కాటక రాశి: వ్యాపారులకు లాభాలు ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ వ్యాపారులకు. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేసారు తోటి ఉద్యోగుల మరియు పై అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం బాగుంది. ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి దానిద్వారా మీకు ఎంతో ఎనర్జీ. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

సింహరాశి: సహనము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసు పనులలో అధిక శ్రమ. పనులను పెండింగ్ లేకుండా పూర్తి చేయటానికి ప్రయత్నించండి. వ్యాపారులకు లాభాలు వ్యాపార కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆదాయం బాగుంది. పొదుపు చేస్తారు. దుబారా ఖర్చులను నివారించండి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. పంటి నొప్పికి అవకాశం తీపి పదార్థాలను చల్లటి పదార్థాలను వదిలేయండి ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కన్యారాశి: ఆదాయం బాగుంది ముఖ్యమైన అవసరాలకు ఖర్చు పెడతారు. జరిగిపోయిన విషయాలను గురించి ఆలోచించకండి భవిష్యత్తు వైపు చూడండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ముఖ్యంగా పిల్లలతో గడపడం మీకు ఎంతో ఎనర్జీ. కొంతమందికి ఈ ప్రపంచాన్ని వదిలి దూరంగా ఎవ్వరు లేని చోటికి వెళ్ళి ఉందామని అనిపిస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు పాత విషయాలను మరిచిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

తులారాశి: ఈరోజు మీ మనసు మీ మాట వినట్లేదు. దానివలన ఏ విషయం మీద సరైన ధ్యాస పెట్టలేరు. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. ఆఫీసులో ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకండి. సహనంతో వ్యవహరించండి. వ్యాపారులు నూతన పెట్టుబడులపై పునరాలోచించుకోవాలి. కావలసినంత ధనం చేతికందుతుంది. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. మీ పిల్లల చదువులను ఒక కంట గమనించండి. వారు చదువు మీద ధ్యాస పెట్టకుండా సమయం వృధా చేస్తున్నారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవి చూస్తారు.

వృశ్చిక రాశి: మీ శక్తిసామర్ధ్యాలను వెలికి తీయండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. దాని వలన కొంత మంది ఉద్యోగం మార్పుకై ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు. మరింత సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. విద్యార్థులు టీవీ మొబైల్ వాడకం తగ్గించండి చదువు మీద ధ్యాస పెట్టండి. సమయాన్ని వృధా చేయకండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. మీ పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

ధనస్సు రాశి: సహనము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి వ్యాపారులకు లాభాలు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి మీ తండ్రిగారు నుంచి విలువైన సలహాలు తీసుకోండి. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు తోటి ఉద్యోగుల మరియు పై అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం బాగుంది పాత బకాయిలు వసూలవుతాయి.ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది ఈరోజు ప్రపంచానికి దూరంగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈ రాశి స్త్రీలు మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మానేసి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపడానికి ప్రయత్నించండి.

మకర రాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులకు కొంత సమయం గడపండి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీ దుబారా అనవసరపు ఖర్చులపై మీ ఇంట్లో పెద్ద వారు మీకు క్లాస్ పీకుతారు. ఆఫీసులో మీ పని నిబద్ధత పై అందరి ప్రశంసలు విదేశాలలో ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకు శుభవార్త. వ్యాపారులకు ముఖ్యంగా ఇనుము వ్యాపారం చేసే వారికి లాభాలు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు టెన్షన్ వదిలి మరింత కష్టపడండి విజయం దక్కుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవి చూస్తారు.

కుంభరాశి: అధిక సామర్థ్యం తెలివితేటలను ఉపయోగించి అనుకున్న కార్యాలను సాధిస్తారు. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. అధిక సామర్థ్యంతో పనులను పూర్తి చేయవలసి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారులకు మరిన్ని లాభాలు. విదేశాలలో వ్యాపార సంబంధాలను మెరుగుపరచుకోవడానికి సరైన అవకాశం. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టండి సమయాన్ని వృధా చేయకండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి మీ పెద్ద వారి ఆశీర్వచనాలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చల్లటి పదార్థాలను వదిలివేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి. నమ్మకమే మీ వైవాహిక జీవితానికి పునాది.

మీన రాశి: ఈ రోజు లక్ష్మీ అమ్మవారి కి పూజ చేయండి మంచి జరుగుతుంది. సహనంతో వ్యవహరించండి. వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచి లాభాలు. ఆఫీసులో మీ పని నిబద్ధత పై అందరి ప్రశంసలు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆదాయం బాగుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవి చూస్తారు.



Next Story

Most Viewed