గురువారం పంచాంగం, రాశిఫలాలు (15-04-2021)

by  |
Panchangam Rasi phalalu
X

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి: తదియ మ12.49 తదుపరి చవితి
వారం: గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం: కృత్తిక సా6.09 తదుపరి రోహిణి
యోగం: ఆయుష్మాన్ మ3.19 తదుపరి సౌభాగ్యం
కరణం: గరజి మ12.49 తదుపరి వణిజ రా1.48 ఆ తదుపరి భద్ర/విష్ఠి
వర్జ్యం: ఉ.శే.వ6.37వరకు
దుర్ముహూర్తం: ఉ9.56 – 10.45 & మ2.53 – 3.42
అమృతకాలం:మ3.29 – 5 15
రాహుకాలం : మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం: ఉ6.00 – 7.30
సూర్యరాశి: మేషం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం: 5.49
సూర్యాస్తమయం: 6.11

నేటి రాశిఫలాలు

మేషం

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక నష్టాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులుంటాయి. దైవకార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్పదు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ​

వృషభం

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వృత్తి , ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది. ​

మిధునం

అవసరానికి డబ్బు అందక ఇబ్బంది పడతారు నూతన రుణాలు చేస్తారు. కొన్ని పనులు చికాకు కలిగిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి ఉద్యోగాలలో ఒత్తిడి పెరుగుతుంది. ​

కర్కాటకం

నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో అనుకూల ఫలితాలుంటాయి. భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ​

సింహం

అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆప్తుల నుండి సహాయం అందుతుంది. ఉద్యోగాలలో ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ​

కన్య

చేపట్టిన పనులు మీ ఓర్పును పరిక్షిస్తాయి. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల మాటలు మానసికంగా స్థిమితం ఉంచవు. ఆలోచనలు అంతగా కలసిరావు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. ​

తుల

కొన్ని వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. పాత మిత్రులతో వివాదాలుంటాయి.అధిక శ్రమకు స్వల్ప ఫలితం పొందుతారు. వ్యాపారములకు పెట్టుబడులు అందక నిరాశ కలుగుతుంది. ఉద్యోగమున పనికి విమర్శలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ​

వృశ్చికం

సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. కుటుంబమున మీమాటకు గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగాలు నూతన ఆశలు చిగురిస్తాయి. ​

ధనస్సు

బంధువుల నుండి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్థులకుసంతృప్తికరవాతావరణం ఉంటుంది. ​

మకరం

ఆర్థిక వ్యవహారాలు ఒడిదుడుకులుంటాయి. అనవసర విషయాలపై ధనవ్యయం చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన చికాకులు పెరుగుతాయి. దైవ చింతన కలుగుతుంది. వ్యాపారాలలో ఇతరుల వలన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ​

కుంభం

ఇంట బయట పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వెయ్యడం అవసరం. చేపట్టిన పనులలో నిరుత్సాహం తప్పదు. మానసిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. వ్యాపారాలలో ఆర్ధిక ఇబ్బందులుంటాయి. ​

మీనం

నిరుద్యోగ యత్నాలు అనుకూలంగా సాగుతాయి. పాత మిత్రుల కలయికతో గృహమున సందడివాతావరణం ఉంటుంది విందువినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో అధికారుల అండ దండలు లభిస్తాయి. సేవ కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు.


Next Story

Most Viewed