ఈ రాశి వారికి ఊహించని శుభవార్త

by  |
Panchangam
X

తేది : 8, జూలై 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : గురువారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చతుర్దశి
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 21 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 5 గం॥ 16 ని॥ వరకు)
నక్షత్రం : మృగశిర
(నిన్న రాత్రి 6 గం॥ 18 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 56 ని॥ వరకు)
యోగము : వృద్ధి
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 16 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 11 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 56 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 1 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 16 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 58 గంటల వరకు)

మేష రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ భార్య భర్తలు కుటుంబ వ్యవహారాల మీద గొడవలు పడతారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. పనులను సకాలంలో పూర్తి చేయాలంటే మరింత కష్టపడాలి. ఆదాయ వ్యవహారాల్లో పెద్దవారి సహాయం లభిస్తుంది. దుబారా ఖర్చులను నివారించండి లేకుంటే డబ్బుకు ఇబ్బంది పడతారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు చిన్న విషయాలను పెద్దవిగా చేసి గొడవలు పెంచుకోకండి.

వృషభ రాశి: సహనంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. వ్యాపారంలో భాగస్వాముల పట్ల జాగ్రత్త వహించండి. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. అనవసరపు ఖర్చులు వలన డబ్బుకి ఇబ్బంది. బంధువుల దగ్గర తీసుకున్న అప్పును వెంటనే తీర్చి వేయండి లేకుంటే చిక్కుల్లోపడతారు. మీ తల్లి గారి అనారోగ్యం వలన డబ్బు ఖర్చు పెట్టవలసి రావచ్చు. ప్రయాణాలలో ఆరోగ్యం జాగ్రత్త ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

మిధున రాశి: ఆత్మవిశ్వాసాన్ని వదిలి పెట్టకండి. దైవప్రార్థన వలన మానసిక బలం. ప్రముఖ వ్యక్తుల సహాయం వలన ఎంతో ధైర్యం. డబ్బు సహాయం కోసం మీ దగ్గరకి జనాలు వస్తారు. మీ స్థితిగతులను తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. ఆఫీసు పనులలో మీ నిబద్ధత మీద అందరి ప్రశంసలు. అతిశీతల పదార్ధాలు తినడం వలన పంటి నొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు చిన్న విషయాలను పెద్దవిగా చేసి గొడవలు పెంచుకోకండి.

కర్కాటక రాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసు పనుల్లో తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. పనులను పూర్తిచేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులు పెట్టే ముందర అన్ని రకాల పథకాల గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆఫీసు పనులలో మీ సామర్థ్యంపై అందరి ప్రశంసలు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితంలో తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

కన్యారాశి: చేద్దామని అనుకున్న కార్యాలలో ఆటంకాలు. సహనంతో సరైన ప్రణాళికతో ప్రయత్నించండి. అనవసరమైన ఆడంబరాల కోసం ఖర్చు పెట్టడం వల్ల కలిగిన నష్టాన్ని గుర్తిస్తారు. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. దాని వలన అపార్ధాలు తొలగిపోతాయి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ. మీ తండ్రి గారి ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టవలసి రావచ్చు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల వ్యవహారంలో కి మూడవ వ్యక్తిని తీసుకురాకండి.

సింహరాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఈరోజు మీకు కావలసినంత ఆనందంగా గడపండి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆఫీసులో పని పట్ల మీ నిబద్ధతకు అందరి ప్రశంసలు. కావాల్సినంత ధనం చేతికందుతుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెడతారు. ఫిట్నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

ధనుస్సు రాశి: పట్టుదలతో ఆశావాద దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసులో పనులను అధిక శ్రమ ఉన్నప్పటికీ సహనంతో సకాలంలో పూర్తి చేయండి. మనసు నిండా ధైర్యం నింపుకోండి. భయాలను పిరికితనాన్ని వదిలిపెట్టండి. కుటుంబ సభ్యులతో ఆదాయ వ్యవహారాల గురించి చర్చిస్తారు. కావలసిన ధనం చేతికందుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అవకాశాలు మీ చేతికి అందుతాయి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృశ్చిక రాశి: అతిగా బాధపడటం వలన మానసిక విచారం. దాని వలన ఎసిడిటీ. దానివలన రోగం. వీటిని వదిలించుకోండి. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆఫీసులో పని పట్ల మీ నిబద్ధతకు అందరి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. మీ పిల్లలతో గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. అప్పులను తీర్చలేక ఉంటే ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవడం వలన మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

తులారాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. దైవప్రార్థన వలన మానసిక బలం. పాతబాకీలు వసూలవుతాయి. ఆఫీసులో పనులను సకాలంలో పట్టుదలతో పూర్తి చేస్తారు. మీ భార్య భర్తల సామరస్య ధోరణి వల్ల కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. కుటుంబ సభ్యుల అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

మకర రాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలు సాధిస్తారు. ఆదాయ వ్యవహారాలు మానసిక అశాంతిని కలగజేస్తాయి. ధైర్యాన్ని కోల్పోకండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ప్రేమికులకు మర్చిపోలేని రోజు. తోటి ఉద్యోగులతో సామరస్యంగా ఉండండి ఆధిపత్యం చెలాయించాలని చూడకండి. ఆదాయం పరవాలేదు. కుటుంబంలో పెద్ద వారి ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టవలసి రావచ్చు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

కుంభరాశి: కుటుంబంలో కలహాల వలన మానసిక అశాంతి. ఇంటిలో పెద్ద వారి సలహాలు తీసుకోండి. చాలా మంది మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తారు ఎవ్వరికి తొందరపడి మాట ఇవ్వకండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు తోటి ఉద్యోగుల మరియు పై అధికారుల ప్రశంసలు. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. వ్యాపార విస్తరణ కొరకు ప్రయాణాలు చేస్తారు. అధిక శ్రమ వల్ల మోకాళ్ల నొప్పులు ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం లేదని మానసిక అశాంతి.

మీన రాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. అతిగా తినడం వల్ల ఊబకాయం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. భార్యతో గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. ఊహించని శుభవార్త అందుతుంది. దానివలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. కావలసిన ధనం చేతికందుతుంది బ్యాంక్ బలం పెరుగుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం లేదని మానసిక అశాంతి.



Next Story

Most Viewed