గురువారం పంచాంగం, రాశిఫలాలు (20-05-2021)

by  |
గురువారం పంచాంగం, రాశిఫలాలు (20-05-2021)
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : అష్టమి
(నిన్న ఉదయం 12 గం॥ 46 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 12 గం॥ 18 ని॥ వరకు)
నక్షత్రం : మఖ
(నిన్న సాయంత్రం 3 గం॥ 44 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 3 గం॥ 52 ని॥ వరకు)
యోగము : వ్యాఘాతము
కరణం : బవ
వర్జ్యం : (తెల్లవారు జాము 3 గం॥ 48 ని॥ నుంచి 5 గం॥ 24 ని॥ వరకు)(రాత్రి 11 గం॥ 41 ని॥ నుంచి తెల్లవారు జాము 1 గం॥ 14 ని॥ వరకు)
అమ్రుత ఘడియలు : ( మధ్యాహ్నం 1 గం॥ 27 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 3 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 10 గం॥ 1 ని॥ నుంచి 10 గం॥ 53 ని॥ వరకు)(సాయంత్రం 3 గం॥ 13 ని॥ నుంచి 4 గం॥ 5 ని॥ వరకు)
రాహుకాలం : ( మధ్యాహ్నం 1 గం॥ 49 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 26 ని॥ వరకు)
గుళికకాలం : ( ఉదయం 8 గం॥ 57 ని॥ నుంచి 10 గం॥ 34 ని॥ వరకు)
యమగండం : (ఉదయం 12 గం॥ 12 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 49 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 42 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : సింహము

మేష రాశి : సామాజిక కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యాపారంలో మీరు పాటిస్తున్న మెళకువలు ఎవ్వరితోటి చెప్పకండి. వ్యాపారంలో ముఖ్యంగా export బిజినెస్ చేసే వారికి సదవకాశం. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. మీ పెద్దల పరంగా ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. ఈ రాశి స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం వస్తుంది.

వృషభ రాశి : ఆరోగ్య సమస్యలు పూర్తిగా చక్కబడతాయి. మీ మనో ధైర్యమే మీకు శ్రీరామరక్ష. విదేశాలతో చేస్తున్న వ్యాపారం లాభాల బాట పడుతుంది. నూతన పెట్టుబడులు మరియు స్థిరాస్తుల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా వేయండి. కార్యాలయంలో మీ సామర్థ్యాన్ని అందరూ ప్రశంసిస్తారు. ధన లాభం ఉంది. ఆర్థిక విషయాలలో మీ బంధువులను కానీ సన్నిహితులను గాని వేలు పెట్టనివ్వకండి. ఈ రాశి స్త్రీలు కుటుంబంలో ప్రశాంతత లోపించకుండా జాగ్రత్త వహించండి.

మిధున రాశి : దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. కార్యాలయంలో దొంగచాటుగా మీ ప్రణాళికలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను తీసుకు వస్తాయి. ప్రశాంత చిత్తంతో పనిచేయండి అన్నీ మీకు అనుకూలం. ఈ రాశి స్త్రీలు మీ మీద ఆధారపడిన వారికి తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తారు.

కర్కాటక రాశి : ప్రశాంతచిత్తంతో మరియు ప్రణాళికాబద్ధంగా పని చేయండి విజయం మీదే. వ్యాపారం బాగుంటుంది. ఊహించని అవకాశాలు లభిస్తాయి. నూతన పెట్టుబడులు వలన మరింత లాభం. ఈ రాశి స్త్రీలకు మీ జ్ఞాపకశక్తి మీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.

సింహరాశి : విద్యార్థులకు విద్యా అవకాశాలు లభిస్తాయి. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. అందరితో మిత్ర భావంతో సంభాషించండి. కార్యాలయంలో కొత్త సమస్యలు ఎదురుకాకుండా చాకచక్యంతో వ్యవహరించండి. ఒకవైపు మాత్రమే విని నిర్ణయం చెప్పకండి ఎందుకంటే మీ నిర్ణయము రెండవ వారిని ఇబ్బంది పెట్టవచ్చు మరియు మీకు లేనిపోని చికాకులు కలిగించవచ్చు. ఈ రాశి స్త్రీలకు మీరు అందరి సలహాలు వినకపోవడం వల్ల మీరు అహంభావి అని ముద్ర వేస్తారు.

కన్య రాశి : కొందరికి మీ వల్ల మంచి జరుగుతుంది. వ్యాపారంలో లావాదేవీలు మరియు అగ్రిమెంట్ ల మీద సంతకం పెట్టెటప్పుడు జాగరూకతతో వ్యవహరించండి. కుటుంబ సభ్యుల పూర్తి సహకారం లభించాలంటే వారితో సంభాషించండి. ఖరీదైన వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మీరు కలలు కన్న గమ్యాన్ని చేరుకుంటారు. ఈ రాశి స్త్రీలు సంతాన విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు.

తులారాశి : కార్యాలయంలో మీకు అనవసరమైన సలహాలు ఇచ్చే వారు ఎక్కువ అవుతారు వారిని పక్కకు పెట్టి మీ పనిని పట్టుదలతో పూర్తి చేయండి. అనవసరపు ఖర్చుల జోలికి పోకండి. కుటుంబ సభ్యులతో సంభాషించటం వలన వారు మీకు అర్థం అవుతారు అపార్ధాలు తొలగిపోతాయి. విద్యార్థులు నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో కొంతమంది ప్రవర్తన ఇష్టం లేకపోయినా భరించవలసి వస్తుంది. ఈ రాశి స్త్రీలు మీ పిల్లల ప్రవర్తన ను జాగ్రత్తగా పరిశీలించండి.

వృశ్చిక రాశి : వ్యవహారాలలో ఆటంకాలు క్రమేపి తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నా అవసరాలు తీరుతాయి. కుటుంబ సభ్యులతో సంభాషించటం వలన అపార్ధాలు తొలగిపోతాయి. స్థిరాస్తుల లావాదేవీలలో మీ మాట నెగ్గుతుంది. మత్తుపదార్థాల జోలికి పోకుండా మీ మైండ్ ను కంట్రోల్ చేసుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ ఆలోచనా విధానం అర్థం కాక మీరు అహంభావి అని ముద్ర వేస్తారు.

ధనుస్సు రాశి : మానసికంగా శారీరకంగా పూర్తిగా అలసిపోయిన మీకు యోగా మెడిటేషన్ మేలు చేస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబంలోని వ్యక్తులతో వివాదాస్పద విషయాల గురించి చర్చించకండి. కార్యాలయంలో పనులను పెండింగ్ పెట్టకండి. మనసుపెట్టి పనిచేసి పూర్తి చేయండి. ఆహ్లాదకరమైన సంభాషణ మీ జీవిత భాగస్వామిని మరింత ఆనందింప చేస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం. ఈ రాశి స్త్రీలకు మీ ఆత్మీయులు మీరు వారికి అనుగుణంగా లేరు అని నిందలు వేయడానికి అవకాశం ఉంది.

మకర రాశి : ఉల్లాసంగా ఉత్సాహంగా గడపటానికి తగిన సమయం. ఎదురు చూస్తున్న ఫలితం ఒకటి వచ్చే అవకాశం ఉంది. మీరు ఇంతకు ముందు కొన్న స్థలము అమ్మకం వలన మంచి లాభాలు వచ్చే అవకాశం. ఉద్యోగాలలో అనుకున్న హోదాను సాధిస్తారు. అతిగా టీవీని చూడటం మొబైల్ వాడకం సమయం వృధా అని తెలుస్తుంది. వృధా ఖర్చు చాలా వరకు అరికడతారు. ఈ రాశి స్త్రీలు సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు.

కుంభరాశి : మీ ఆశావహ దృక్పథం మీ కోరికలను నెరవేర్చుకునే సరైన దారిలో మిమ్మల్ని నిలబడుతుంది. అధిక ఖర్చుల వలన డబ్బు నిల్వ చేయలేకపోతారు. మీ నిజాయితీ ప్రవర్తనతో ఒక సమస్య నుంచి బయట పడతారు. కుటుంబం నుంచి దూరంగా ఉన్నవారు తమ కుటుంబ సభ్యులతో సంభాషించండి ఈ కరోనా సమయంలో మీకు ఆదుర్దా తగ్గుతుంది. కార్యాలయంలో మీకు నచ్చని వ్యక్తి ఇచ్చిన సలహా వలన పని జరుగుతుంది. ఈ రాశి స్త్రీలు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు.

మీన రాశి : ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది. ఈ కరోనా సమయంలో వ్యాపారంపై పూర్తి శ్రద్ధ పెట్టండి. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. ఆర్థికపరమైన విషయాలలో సరైన సలహా తీసుకోకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ఈ రాశి స్త్రీలకు ఇష్ట దైవ స్మరణ తో మేలు జరుగుతుంది.

Next Story

Most Viewed