గురువారం పంచాంగం, రాశిఫలాలు (17-06-2021)

by  |
Panchangam
X

ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : సప్తమి (నిన్న రాత్రి 10 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 56 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వఫల్గుణి (నిన్న రాత్రి 10 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 10 ని॥ వరకు)
యోగము : వజ్రము
కరణం : గరజ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 6 గం॥ 11 ని॥ నుంచి 7 గం॥ 46 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు మధ్యాహ్నం 3 గం॥ 46 ని॥ నుంచి సాయంత్రం 5 గం॥ 21 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 4 ని॥ నుంచి 10 గం॥ 56 ని॥ వరకు)(ఈరోజు మధ్యాహ్నం 3 గం॥ 20 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 12 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మధ్యాహ్నం 1 గం॥ 54 ని॥ నుంచి 3 గం॥ 32 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 58 ని॥ నుంచి 10 గం॥ 36 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 15 ని॥ నుంచి 1 గం॥ 53 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 51 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : సింహము

మేష రాశి : పట్టుదలతో సహనంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కావలసినంత ధనం చేతికందుతుంది. మరింత సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. కొంతమంది నూతన వాహనాలు కొంటారు సహోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబ సభ్యులతో మొరటుగా మాట్లాడకండి. మీ మాటలు వారిని వారితో కూర్చుని మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో కావలసినంత సమయం గడపడం లేదని మానసిక అశాంతి.

వృషభ రాశి : ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆసక్తి కనబరుస్తారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు. ఆఫీసు పనులు పెండింగ్ లేకుండా ఉండాలంటే కష్టపడి పని చేయవలసి ఉంటుంది. అధిక శ్రమ వలన భుజాల నొప్పులు. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ. అనవసరపు దుబారా ఖర్చులు చేయకండి. విద్యార్థులకు వారి శ్రమకు తగిన ఫలితం. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు ఉంటాయి. ఫిట్ నెస్ కొరకు చేసిన ప్రయత్నాలు సఫలం. కొంతమందికి స్థిరాస్తి కొనుగోలుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం.

మిధున రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. అనవసర దుబారా ఖర్చులను నివారించండి. కుటుంబంలోని వ్యక్తులతో మనసు విప్పి మాట్లాడండి. ఆఫీసు పనులను పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అధిక శ్రమ వలన కాళ్ల నొప్పులు రావచ్చు యోగా లేక జిమ్ ఒక మంచి ఉపాయం ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

కర్కాటక రాశి : సహనంతో పట్టుదలతో అన్ని కార్యాలను సాధిస్తారు. గందరగోళం వదిలేయండి. దైవప్రార్థన వలన మానసిక బలం. కుటుంబ సభ్యులతో ఖర్చుల గురించి భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు మీ పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టట్లేదు జాగ్రత్తగా చూడండి. పాత స్నేహితులతో కలిసి ఆనందిస్తారు. ఆఫీసు పనుల్లో నిర్లక్ష్యం వద్దు దానివలన లేనిపోని తప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

సింహరాశి : సహనంతో వ్యవహరించండి. ముఖ్యమైన నిర్ణయాలను ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. కావాల్సినంత ధనం చేతికందుతుంది. దాని వలన మనస్సు పూర్తిగా ప్రశాంతం. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వలన ఎంతో ఎనర్జీ. ఆఫీసు పనులు అనుకున్న విధంగా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆదాయం కన్నా అనుకోని ఖర్చులు ఎక్కువ. ప్రయాణాలలో వస్తువులు జాగ్రత్త. అధికరణ మరణ వెన్నునొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల కుటుంబ విషయాలలో కి మూడో వ్యక్తిని రానీయకండి.

కన్యారాశి : అనుకున్న పనులలో ఆటంకాలు వలన మానసిక అశాంతి. ఆశావహ దృక్పథం మరియు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. బంధువుల రాక మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో మనసువిప్పి మాట్లాడటం వలన అపార్ధాలు తొలగిపోతాయి. ఆఫీసు పనులలో మీ శక్తి సామర్థ్యాలపై ప్రశంసలు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

తులారాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. పట్టుదలతో అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. మరింత డబ్బు సంపాదనకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపటం వలన ఎంతో ఎనర్జీ. ఆఫీసు పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. తతోటి ఉద్యోగులు మరియు పై అధికారుల ప్రశంసలు. కావలసిన ధనం చేతికందుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

వృశ్చిక రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సహనంతో వ్యవహరించండి. పరుషంగా మాట్లాడటం వలన మీ తోటి వారికి ఇబ్బంది. ఆఫీసులో పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మీ పని సామర్థ్యం పై పై అధికారుల ప్రశంసలు. కావాల్సినంత డబ్బు చేతికి అందుతుంది. డబ్బును పెట్టుబడులలో పెడతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం లేదని మానసిక అశాంతి.

ధనుస్సు రాశి : కొత్త వారితో పరిచయాలు వలన లాభం. నిరాశావాదం, గందరగోళం వదిలివేయండి. స్నేహితులు మిమ్మల్ని అప్పు అడగవచ్చు కానీ ఇచ్చినందువలన డబ్బు ఇబ్బంది. అందువలన అప్పు ఇవ్వకండి. ఆఫీసు పనుల్లో నూతన బాధ్యతలు వలన అధిక శ్రమ. సరైన ప్రణాళికతో పనులను పూర్తి చేయండి. ఒక శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. వ్యాపారంలో లాభాలు కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదాయ వ్యవహారాలు పర్వాలేదు ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మకర రాశి : నిరాశావాదం వదిలేయండి. సహనంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. మరింత సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. అధిక శ్రమ వలన తగినంత విశ్రాంతి తీసుకోవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో, పిల్లలతో ఆనందంగా గడపటం ఒక మంచి ఉపాయం. మీ భార్య చెప్పినది పూర్తిగా వినండి. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ప్రయాణాలలో వస్తువులు జాగ్రత్త. కుటుంబ సభ్యుల అనారోగ్యం వలన అధిక ఖర్చు. ప్రముఖులతో పరిచయం వల్ల లాభాలు. బయట భోజనం వల్ల అజీర్తి. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో కలిసి కుటుంబ విషయాల మీద భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు.

కుంభరాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ముఖ్యమైన నిర్ణయాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలు సాధిస్తారు. మానసిక రోగం నుంచి బయటకి రండి. దైవ ప్రార్థన ఒక మంచి ఉపాయం. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయడం వలన అధికారుల ప్రశంసలు. ఆఫీసులో మీరంటే ఇష్టం లేనివారు కూడా మీకు మిత్రులు అవుతారు. కావలసినంత ధనం చేతికందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. సరైన పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు

మీన రాశి : ఆత్మ విశ్వాసం పట్టుదల మీ ఆయుధాలు. వీటితో మీరు అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొంతమందికి జీతాలు పెరుగుతాయి. స్టాక్ మార్కెట్ లో లాభాలు. కావలసినంత ధనం చేతికందుతుంది. స్థిరాస్తుల లావాదేవీలలో ఊహించనంత లాభాలు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ భర్త ఒక ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

Next Story