- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి తలుపుతట్టి.. పుస్తెల తాడు అపహరణ
by Batti.Sumithra |
<p>దిశ, మునుగోడు: వృద్ధ దంపతులను బెదిరించి, ముగ్గరు గుర్తు తెలియని వ్యక్తులు పుస్తెలతాడు అవహరించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని కల్వలపల్లి గ్రామం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుట్ట ఎల్లారెడ్డి తన వ్యవసాయ పొలంలోనే ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం పుట్ట ఎల్లారెడ్డి తన భార్య సుజాతతో కలిసి వుండగా రాత్రి 11 గంటల సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బెదిరించి వారి వద్ద వున్న రూ.20 […]</p>

X
దిశ, మునుగోడు: వృద్ధ దంపతులను బెదిరించి, ముగ్గరు గుర్తు తెలియని వ్యక్తులు పుస్తెలతాడు అవహరించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని కల్వలపల్లి గ్రామం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుట్ట ఎల్లారెడ్డి తన వ్యవసాయ పొలంలోనే ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం పుట్ట ఎల్లారెడ్డి తన భార్య సుజాతతో కలిసి వుండగా రాత్రి 11 గంటల సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బెదిరించి వారి వద్ద వున్న రూ.20 వేల నగదు, బంగారు పుస్తెల తాడును తీసుకొని పారిపోయారు. దీంతో మంగళవారం ఉదయం బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన మునుగోడు ఎస్సై రజినీకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






