- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. బడిగాం ప్రాంతంలో గురువారం రాత్రి ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైనికులు, సీఆర్పీఎఫ్ బలగాలు కలిసి ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. బడిగాం ప్రాంతంలో గురువారం రాత్రి ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైనికులు, సీఆర్పీఎఫ్ బలగాలు కలిసి ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. మరోవైపు భారత్ జవాన్ మృతి చెందగా, మరో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
Next Story






