చెట్టును ఢీకొన్న బైక్.. ముగ్గురు మృతి

38

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు జమీర్, సమీర్, సోఫిక్… పుల్కల్ మండలంలోని సింగూరు డ్యామ్‌ చూసేందుకు వెళ్తుండగా మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న బైక్ చెట్టును ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి వెళ్తుండగా జమీర్, సమీర్ ప్రాణాలు కోల్పోగా.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోఫిక్ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.