మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి 

3

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన నాగర్ ‎కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి కుమ్మేర గ్రామంలో మట్టి మిద్దె కూలింది. దీంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాగర్‎కర్నూలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు హనుమంతు రెడ్డి, ఆయన భార్య కొండ అనసూయమ్మ, మనవడు హర్షవర్ధన్ రెడ్డిలు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.