- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు ముగ్గురు మృతి
by Chintha Aamani |
<p>దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కనికి ప్రాంతంలో ఎడ్లబండిపై పిడుగు పడి ముగ్గురు రైతులు మృతిచెందారు. వివరాల ప్రకారం.. కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన పద్మ(40), డోంగ్రి శ్వేత (18), బొర్కోట్ పున్నయ్య.. కనికి శివారు పత్తి చేనులో ఎరువులు వేసేందుకు వెళ్లారు. చేను నుంచి తిరిగి వస్తున్నప్పుడు భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే ఎడ్లబండిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. డోంగ్రి […]</p>

X
దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కనికి ప్రాంతంలో ఎడ్లబండిపై పిడుగు పడి ముగ్గురు రైతులు మృతిచెందారు. వివరాల ప్రకారం.. కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన పద్మ(40), డోంగ్రి శ్వేత (18), బొర్కోట్ పున్నయ్య.. కనికి శివారు పత్తి చేనులో ఎరువులు వేసేందుకు వెళ్లారు. చేను నుంచి తిరిగి వస్తున్నప్పుడు భారీ వర్షం కురిసింది.
ఈ క్రమంలోనే ఎడ్లబండిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. డోంగ్రి పద్మ, శ్వేత.. తల్లి, కూతుర్లు కాగా.. పున్నయ్య వేరే కుటుంబానికి చెందిన వ్యక్తి. పిడుగుపాటుతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన ముగ్గురితో పాటు ఒక ఎద్దు కూడా చనిపోయింది. ఘటన స్థలానికి కౌటాల ఎంపీపీ విశ్వనాథ్, తహసీల్దార్ మున్వర్ షరీఫ్, ఎస్ఐ ఆంజనేయులు చేరుకొని వివరాలు సేకరించారు.

Next Story






