- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెట్టును ఢీకొన్న కారు: ముగ్గురు మృతి
<p>దిశ, రంగారెడ్డి: మరికాసేపట్లో ఆ యువకులు ఇంటికి చేరేలోపే మృత్యువు కబళించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ యువకుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయ్యాయి. చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్ల నుంచి నలుగురు యువకులు వారి స్వగ్రామం ఆలూరుకు కారులో వెళ్తుండగా.. మరో వాహనం ఎదురుగా రావడంతో తప్పించబోయి చెట్టును ఢీ కొట్టారు. దీంతో కారులో ఉన్న నలుగురిలో […]</p>

దిశ, రంగారెడ్డి: మరికాసేపట్లో ఆ యువకులు ఇంటికి చేరేలోపే మృత్యువు కబళించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ యువకుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయ్యాయి. చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్ల నుంచి నలుగురు యువకులు వారి స్వగ్రామం ఆలూరుకు కారులో వెళ్తుండగా.. మరో వాహనం ఎదురుగా రావడంతో తప్పించబోయి చెట్టును ఢీ కొట్టారు. దీంతో కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు ఎన్కతల రఘు, సారె నరేష్, గారెల్లా రాఘవేందర్ మృతి చెందారు. నడికుడి నవీన్ తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో అతన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతి చెందినవారిలో ఎన్కతల రఘు వికారాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.






