తల్లిదండ్రులు లేని యువతిని లాడ్జికి తీసుకెళ్లి.. ఒకరి తర్వాత మరొకరు..!

319
rape-in-tirupathi

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు లేని 19 ఏళ్ల యువతిని లాడ్జికి తీసుకెళ్లి నాగేంద్రబాబు అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో ఇద్దరు కూడా అత్యాచారం చేసినట్లు సమాచారం. ఈ ఘటన తిరుపతిలోని మంగళం ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం వెలుగుచూసింది.

అయితే, తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని స్వయంగా బాధితురాలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అయితే, ఆ యువతితో చాలాకాలంగా నాగేంద్రబాబుకు సంబంధం ఉందని తెలుస్తోంది. మరో ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..