- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విహారయాత్రలో విషాదం.. వాగులో ముగ్గురు వ్యక్తుల గల్లంతు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: విశాఖ జిల్లా బుచ్చయ్యపేటలో విహారయాత్ర విషాదంగా మారింది. సరదగా స్నానం చేసేందుకు వాగులో దిగిన ముగ్గురు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే… బంగారుమెట్ట పెద్దేరు వాగులో స్నానం చేసేందుకు ముగ్గురు వ్యక్తులు వాగులో దిగారు. ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తుండగా ఒక్కసారిగా మునిగిపోయారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు వెతకినా ఆచూకీ దొరకలేదు. దీంతో బుచ్చయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే వాగులో గల్లంతైన వారిలో […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ జిల్లా బుచ్చయ్యపేటలో విహారయాత్ర విషాదంగా మారింది. సరదగా స్నానం చేసేందుకు వాగులో దిగిన ముగ్గురు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే… బంగారుమెట్ట పెద్దేరు వాగులో స్నానం చేసేందుకు ముగ్గురు వ్యక్తులు వాగులో దిగారు. ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తుండగా ఒక్కసారిగా మునిగిపోయారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు వెతకినా ఆచూకీ దొరకలేదు. దీంతో బుచ్చయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే వాగులో గల్లంతైన వారిలో ఇద్దరు వడ్డాది గ్రామానికి చెందినవారు కాగా మరోకరు నర్సీపట్నం గ్రామానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. గల్లంతైన వారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
Next Story






