విశాఖ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

59

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బైక్‌ ఢీకొట్టడంతో ఎలమంచిలి మిల్ట్రీ కాలనీకి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి ఉంది. ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో పాటు మరొకరు తీవ్రంగా గాయపడగా విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.