- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంపర్ ఆఫర్.. వందకు మూడు కిలోల టమాట.. ఎక్కడో తెలుసా ?
<p>దిశ, ఖైరతాబాద్ : ప్రతి కూరకు రుచిని తెచ్చిపెట్టే టమాట సామాన్య మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తోంది. టమాట గిట్టుబాటు కావడం లేదంటూ, రైతులు టన్నుల కొద్దీ టమాటాలను రోడ్లపై పడేసిన సందర్భాలు చూశాం. కానీ, ప్రస్తుతం పరిస్థితి వేరు. టమాట ధర ఆకాశాన్ని అంటుతుంది. మేలు రకం టమాట కిలో 120 వరకు విక్రయిస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో శుక్రవారం ఉదయం లక్డీకపూల్ లోటస్ ఆసుపత్రి సమీపంలో ఆటో పై […]</p>

X
దిశ, ఖైరతాబాద్ : ప్రతి కూరకు రుచిని తెచ్చిపెట్టే టమాట సామాన్య మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తోంది. టమాట గిట్టుబాటు కావడం లేదంటూ, రైతులు టన్నుల కొద్దీ టమాటాలను రోడ్లపై పడేసిన సందర్భాలు చూశాం. కానీ, ప్రస్తుతం పరిస్థితి వేరు. టమాట ధర ఆకాశాన్ని అంటుతుంది. మేలు రకం టమాట కిలో 120 వరకు విక్రయిస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో శుక్రవారం ఉదయం లక్డీకపూల్ లోటస్ ఆసుపత్రి సమీపంలో ఆటో పై వచ్చిన అమ్మకపు దారులు వందకి మూడు కిలోలని బోర్డు పెట్టడంతో కొనుగోలుదారులు క్యూ కట్టారు. అరగంటలోనే ఆటో లోని టమాటలన్నీ అమ్ముడుపోయాయి.
Next Story






