అలర్ట్ : తెలంగాణలో మరో మూడు రోజులు.. అక్కడక్కడ భారీ వర్షాలు

by  |
అలర్ట్ : తెలంగాణలో మరో మూడు రోజులు.. అక్కడక్కడ భారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : దక్షిణ ఒడిశా, పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉన్నది. పశ్చిమ, వాయువ్య దిశల నుంచి రాష్ట్రంలో కిందిస్థాయి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, నేడు రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం ( ఆదివారం ) వరకు పలుచోట్ల వర్షం పడింది.

ఇక గత రాత్రి నుంచి ఇవాళ వేకువజాము వరకు హైదరాబాద్‌లో వర్షం పడుతోంది. తెల్లవారు నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, నాంపల్లి, అమీర్ పేట, కూకట్ పల్లి, నారాయణ గూడ, ఖైరతాబాద్, బంజారహిల్స్ ప్రాంతాల్లోని రోడ్లన్ని జలమయమయ్యాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు కొన్ని చోట్ల అంతరాయం ఏర్పడింది. అలాగే మహబూబాబాద్ జిల్లా ఉప్పరిగూడెంలో అత్యధికంగా 10.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా పెద్దపెల్లి జిల్లా, కరీంనగర్‌లో కూడా ఓ మోస్తరు వర్షం పడిందని అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed