మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. రాష్ట్రంలో రెండు రోజులు వైన్ షాపులు బంద్

by Disha Web Desk 19 |
మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. రాష్ట్రంలో రెండు రోజులు వైన్ షాపులు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. క్యాంపెయినింగ్‌కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపించడంతో ప్రచారంతో పాటు మద్యం, మనీతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మందు బాబులకు తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్ చెప్పింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో 48 గంటల (రెండు రోజులు) పాటు మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్‌లు మూసివేయాలని ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా రెండు రోజుల పాటు డ్రై డేగా ప్రకటించినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూల్స్ పాటిస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా సహకరించాలని కోరారు. ఇక, వరుసగా రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ అని తెలియడంతో మందు బాబులు వైన్స్‌లకు క్యూ కట్టారు. మద్యం బాబులతో వైన్ షాపులు కిక్కిరిసిపోయాయి. కాగా, ఈ నెల 13వ తేదీన తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలతో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. పోలింగ్‌కు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed