రష్మిక, విజయ్ దేవరకొండ బ్రేకప్..అలా క్లారిటీ ఇచ్చిన నేషనల్ క్రష్?

by Disha Web Desk 8 |
రష్మిక, విజయ్ దేవరకొండ బ్రేకప్..అలా క్లారిటీ ఇచ్చిన నేషనల్ క్రష్?
X

దిశ, సినిమా : విజయ్ దేవరకొండ, రష్మికల గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది. సైలెంట్ లవ్ బర్డ్స్ అంటూ వీరిపై అనేక కామెంట్స్ వచ్చాయి. గీతా గోవిందం సినిమాలో రష్మిక, విజయ్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతే కాకుండా వీరి కెమిస్ట్రీకి, ఈ జంటకు మంచి మార్కులు పడ్డాయి. కొంతమంది వీరు పెళ్లి చేసుకుంటే బాగుండు అని కూడా అనుకున్నారు. అంతలా బాగుంది వీరి కాంబినేషన్.

అయితే ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం మొదలై చివరికి ప్రేమలా మారిందని, వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ రోజూ ఒక వార్త వస్తూనే ఉంటుంది. అంతే కాకుండా దుబాయ్ ట్రిప్, వెకేషన్స్ ఇలా చెట్టా పట్టేలేసుకొని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.. ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయ్యిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వీటిపై వీరు ఎప్పుడూ స్పందించి సరైన సమాధానం ఇవ్వలేదు. కొన్ని సందర్భాల్లో మేము మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చారు. అయినా ఈ రూమర్స్‌కు మాత్రం చెక్ పడలేదు. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది.

మే 9.. విజయ్ దేవరకొండ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈయనకు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున విషెస్ చెప్పారు. కానీ రష్మిక మాత్రం విజయ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపలేదు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు మొదలయ్యాయి. కొందరు రష్మిక, విజయ్ బ్రేకప్ చెప్పుకున్నారు అందుకే బర్త్ డే విషెస్ చెప్పలేదు, అందుకే ఆమె స్టేటస్ కూడా పెట్టలేదంటూ ముచ్చటిస్తున్నారు. కానీ వీరి అభిమానులు మాత్రం ఈ మధ్యకాలంలో రష్మిక,విజయ్‌కు సంబంధించిన అనేక వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. త్వరలో వీరి పెళ్లి.. నిశ్చితార్థం డేట్ కూడా ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది. వీటి నుంచి రౌడీ హీరోను తప్పించడానికి రష్మిక విష్ చేయలేదు అంటున్నారు. కాగా, ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

Read More...

ఆమె పై ఉన్న ఇష్టంతో.. తండ్రిని కాదని ఆమె పేరు మీద కోట్ల ఆస్తి రాసిన విజయ్ దేవరకొండ!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed