ఆ హీరోయిన్‌ను కిడ్నాప్ చేయాలనుకున్న పాకిస్తాన్ క్రికేటర్..ఎందుకంటే?

by Disha Web Desk 8 |
ఆ హీరోయిన్‌ను కిడ్నాప్ చేయాలనుకున్న పాకిస్తాన్ క్రికేటర్..ఎందుకంటే?
X

దిశ, సినిమా : మహేష్ బాబు హీరోయిన్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది సోనాలి బింద్రే. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా మురారి సినిమాలో ఈ బ్యూటీ నటన, అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత ఈబ్యూటీ చాలా ఫేమ్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

ఓ పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ అక్తర్ ఈ నటిని చాలా ప్రేమించాడంట. అంతే కాకుండా ఈమెను కలిసి తన ప్రేమను వ్యక్తపరచాలి అని చాలా ట్రై చేశాడంట. కానీ వీరు ఎప్పుడు కలుసుకోవడానికి వీలుపడలేదంట. చాలా విధాలుగా ఆమెకోసం నేను ట్రై చేశాను, కానీ నాకు ఆమెను కలవడానికి ఒక్క అవకాశం కూడా దొరకలేదు. తనకు నా ప్రేమ గురించి చెప్పాలి అనుకున్నా కానీ, అది ఇప్పటికీ అది జరగలేదు. ఆమె మీద ఉన్న ప్రేమతో కిడ్నాప్ చేసైనా సరే ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను.. అలాగే సోనాలి బింద్రే పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను నా పర్స్ లో పెట్టుకొని తిరిగేవాడిని. అంత ప్రేమ ఉంది ఆమెపై నాకు అంటూ .. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ నటి క్యాన్సర్ బారిన పడి చాలా కాలం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్యే దాని నుంచి బయటపడిన నటి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, వెబ్ సిరీస్‌లు చేస్తున్నట్లు సమాచారం.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed