దక్షిణ కోస్తాలో మరో మూడ్రోజులు భారీ వర్షం

by  |
దక్షిణ కోస్తాలో మరో మూడ్రోజులు భారీ వర్షం
X

దిశ, ఏపీ బ్యూరో: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు, పాండిచ్చేరి మధ్య తీరం దాటే అవకాశమున్నట్లు పేర్కొంది. దీంతో మూడ్రోజుల పాటు దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.



Next Story

Most Viewed