- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కింగ్ కోఠి ఆస్పత్రిలో విషాదం.. ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు పేషెంట్లు మృతిచెందారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆక్సిజన్ అందకే చనిపోయారని ఆందోళన చేస్తున్నారు. స్పందించిన ఆస్పత్రి వైద్యులు ఆక్సిజన్ కొరత కాదని వెల్లడించారు. జడ్చర్ల నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యం అయిందని, దీంతో కొన్ని గంటల పాటు దాదాపు 20 మంది పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయందని అన్నారు. దారి తెలియక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు పేషెంట్లు మృతిచెందారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆక్సిజన్ అందకే చనిపోయారని ఆందోళన చేస్తున్నారు. స్పందించిన ఆస్పత్రి వైద్యులు ఆక్సిజన్ కొరత కాదని వెల్లడించారు. జడ్చర్ల నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యం అయిందని, దీంతో కొన్ని గంటల పాటు దాదాపు 20 మంది పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయందని అన్నారు. దారి తెలియక ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్ అత్తాపూర్‌లోనే ఆగిపోయాడని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన పోలీసులు గ్రీన్ చానల్ ద్వారా ట్యాంకర్‌ను తీసుకొచ్చారు.
Next Story






