- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరదా మిగిల్చిన విషాదం.. ముగ్గురు చిన్నారులు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు చెరువు దగ్గరకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా మారారు. నీళ్ల లోతు ఎక్కువగా ఉండటం, చిన్నారులకు ఈత రాకపోవడం వల్లే ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జిల్లాలోని వెంకటాచలం మండలం చెముడుగుంటలో సోమవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులు బుజబుజ నెల్లూరుకు చెందిన సలీం, సాయి, రాజేలుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు చెరువు దగ్గరకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా మారారు. నీళ్ల లోతు ఎక్కువగా ఉండటం, చిన్నారులకు ఈత రాకపోవడం వల్లే ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జిల్లాలోని వెంకటాచలం మండలం చెముడుగుంటలో సోమవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మృతులు బుజబుజ నెల్లూరుకు చెందిన సలీం, సాయి, రాజేలుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.కుటుంబీకుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






