‘హోలిక దహన్‌’లో ముగ్గురు పిల్లలు సజీవ దహనం..

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్ : హోలి పండుగ సందర్బంగా ‘హోలిక దహన్‌’ కార్యక్రమం నిర్వహించడం ఉత్తరాధి రాష్ట్రాల్లో అనాధిగా వస్తున్న ఆచారం. ఈ నేపథ్యంలో ఆదివారం బీహార్ రాష్ట్రంలో నిర్వహించిన హోలిక దహన్ కార్యక్రమంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లోని పాత వస్తువులను ఒకచోట పొగుచేసి నిప్పుపెట్టిన సందర్భంలో పక్కన గల ఎండు గడ్డికి అంటుకుని మంటలు విస్తరించాయి. హోలిక దహన్‌ కార్యక్రమంలో పాల్గొన్న వారు అక్కడి నుంచి తప్పించుకోగా ప్రమాదవశాత్తు ముగ్గురు పిల్లలు మంటల్లో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు [&hellip;]</p>

‘హోలిక దహన్‌’లో ముగ్గురు పిల్లలు సజీవ దహనం..
X

దిశ, వెబ్‌డెస్క్ : హోలి పండుగ సందర్బంగా ‘హోలిక దహన్‌’ కార్యక్రమం నిర్వహించడం ఉత్తరాధి రాష్ట్రాల్లో అనాధిగా వస్తున్న ఆచారం. ఈ నేపథ్యంలో ఆదివారం బీహార్ రాష్ట్రంలో నిర్వహించిన హోలిక దహన్ కార్యక్రమంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లోని పాత వస్తువులను ఒకచోట పొగుచేసి నిప్పుపెట్టిన సందర్భంలో పక్కన గల ఎండు గడ్డికి అంటుకుని మంటలు విస్తరించాయి.

హోలిక దహన్‌ కార్యక్రమంలో పాల్గొన్న వారు అక్కడి నుంచి తప్పించుకోగా ప్రమాదవశాత్తు ముగ్గురు పిల్లలు మంటల్లో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడంతో ముగ్గురు పిల్లలు సజీవ దహనం అవ్వగా, మరో చిన్నారి కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పడం గమనార్హం.

Next Story