బ్లాక్ మార్కెట్ లో రెమిడిసివిర్..ముగ్గరు అరెస్ట్…

by  |
బ్లాక్ మార్కెట్ లో రెమిడిసివిర్..ముగ్గరు అరెస్ట్…
X

దిశ, క్రైమ్ బ్యూరో : కోవిడ్ -19 కు యాంటీ వైరల్ గా వినియోగించే రెమిడిసివిర్ ఇంజక్షన్ ను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కూకట్ పల్లి బాలాజీనగర్ లో నివసించే షేక్ సలీమ్ జాఫర్ (32) హెటిరో హెల్త్ కేర్ లో ఏరియా బిజినెస్ మేనేజర్ గా, ఫీర్జాదీగూడకు చెందిన బత్తల వెంకటేష్ (27) హెటిరో హెల్త్ కేర్ లో ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా యాంటీ వైరల్ డ్రగ్స్ వినియోగించే రెమిడిసివిర్ కు మార్కెట్ డిమాండ్ ఉండటంతో బ్లాక్ మార్కెట్ దందా చేయాలని భావించారు.

దీంతో రాంనగర్ కు చెందిన మెడికల్ రిప్రెంజెంటేటర్ జోన్నల చరణ్ (26) తో బ్లాక్ మార్కెట్ చేసేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. ఈ ప్రకారం బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద సోమవారం అవసరమైన వినియోగదారులకు రూ.15 వేల రెమిడిసివిర్ ఇంజక్షన్ ను రూ.20 వేలకు విక్రయిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వీరి నుంచి రూ.2.40 లక్షల విలువ చేసే 12 రెమిడిసివిర్ ఇంజక్షన్ లను స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావు తెలిపారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు, ఇతర సిబ్బందిని ఓఎస్డీ రాధాకిషన్ రావు అభినందించారు.


Next Story

Most Viewed