- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుశాంత్‌ను గొంతునులిమి.. చంపారట
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన ఆత్మహత్య చేసుకున్న నాటి నుంచి నేటి వరకూ రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తూ, మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. సుశాంత్ మృతదేహాన్ని ముంబై రెసిడెన్స్ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లిన అంబులైన్స్ డ్రైవర్‌లకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి, బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన ఆత్మహత్య చేసుకున్న నాటి నుంచి నేటి వరకూ రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తూ, మలుపు తిరుగుతోంది.
తాజాగా ఈ కేసులో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. సుశాంత్ మృతదేహాన్ని ముంబై రెసిడెన్స్ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లిన అంబులైన్స్ డ్రైవర్‌లకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి, బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం. ఆసుపత్రికి తీసుకెళ్ళే సమయంలో సుశాంత్ బతికే ఉన్నాడని, తర్వాత గొంతు నులిమి చంపేశారు. దేవుడు మిమ్మల్ని తప్పక శిక్షిస్తాడు అని కాలర్స్ మాట్లాడుతున్నారని అంబులెన్స్ డ్రైవర్స్ చెబుతున్నారు.
సుశాంత్‌ని ఆసుపత్రికి తీసుకెళ్ళే సమయంలో ఫోటోగ్రాఫర్స్ అంబులెన్స్ ఫోటోలు తీయగా, అవి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో కొందరు అజ్ఞాత వ్యక్తులు మాకు కాల్ చేసి దుర్బాషలాడారు. కొన్ని ఇంటర్నేషనల్ కాల్స్ కూడా మాకు వచ్చాయని అంబులెన్స్ డ్రైవర్స్ చెబుతున్నారు. కాగా, సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ బిహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించిన విషయం తెలిసిందే.






