నేషనల్ హైవేగా ఆ రెండు రహదారులు

362
National Highway

దిశ,ఖమ్మం : తెలంగాణలోని రెండు రహదారుల్ని నేషనల్ హైవేలుగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. NH-167 పై మహబూబ్ నగర్ నుంచి కొడంగల్, తాండూరు, కర్ణాటకలోని చించొలీ ద్వారా కర్ణాటకలోని బాపూర్ జంక్షన్ తో అనుసంధానం చేస్తున్న ఈ రోడ్డుకు జాతీయ రహదారి నంబర్ 167-N గా ప్రకటించింది. అలాగే NH-30 పై కొత్తగూడెం నుంచి ఇల్లందు, మహబూబాబాద్, నెల్లికుదురు, తొర్రూరు, వలిగొండ ద్వారా వెళ్తూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి దగ్గర కనెక్ట్ అయ్యే రహదారికి కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్ హెచ్-930 P గా ప్రకటించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..