- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kiara Advani: కియారా ‘సత్యనారాయణ్ కి కథ’ స్టోరీ ఇదేనట
<p>దిశ, సినిమా: యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ – బ్యూటిఫుల్ కియారా అద్వానీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘సత్యనారాయణ్ కి కథ’. అయితే ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. హిందువుల మనోభావాలు కించపరుస్తున్నారంటూ పలు మత సంఘాలు నిరసనలకు దిగాయి. దీంతో టైటిల్ చేంజ్ చేసేందుకు తలొగ్గింది మూవీ యూనిట్. అయితే ‘సత్యనారాయణ్ కి కథ’ పేరు పెట్టేందుకు గల కారణాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా.. హీరో క్యారెక్టర్ నేమ్ సత్యనారాయణ్, హీరోయిన్ […]</p>

దిశ, సినిమా: యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ – బ్యూటిఫుల్ కియారా అద్వానీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘సత్యనారాయణ్ కి కథ’. అయితే ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. హిందువుల మనోభావాలు కించపరుస్తున్నారంటూ పలు మత సంఘాలు నిరసనలకు దిగాయి. దీంతో టైటిల్ చేంజ్ చేసేందుకు తలొగ్గింది మూవీ యూనిట్. అయితే ‘సత్యనారాయణ్ కి కథ’ పేరు పెట్టేందుకు గల కారణాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా.. హీరో క్యారెక్టర్ నేమ్ సత్యనారాయణ్, హీరోయిన్ పాత్ర పేరు కథ అని తెలుస్తోంది. సత్యనారాయణ్ కథ అనే అమ్మాయి మనసు గెలుచుకునేందుకు చేసే ప్రయత్నమే స్టోరీ కాగా.. ‘సత్యనారాయణ్ కి కథ’ అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ సమీర్ అద్వానీ దర్శకత్వంలో వస్తున్న సినిమా ప్యూర్ మ్యూజికల్ లవ్ స్టోరీ అని, రిలీజియన్ సెంటిమెంట్స్‌ను కించపరచదని తెలిపారు మేకర్స్. అయితే నిరసనలతో టైటిల్ చేంజ్ చేస్తున్నట్లు ప్రకటించిన మూవీ యూనిట్.. హీరోహీరోయిన్ల క్యారెక్టర్ నేమ్స్ కూడా చేంజ్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.






