- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ వల్లే ఇంతటి గెలుపు సాధ్యం.. వైసీపీ అభ్యర్థి డా.దాసరి సుధ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: బద్వేలు నియోజకవర్గ ప్రజలకు వైసీపీ అభ్యర్థి డా. దాసరి సుధ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉపఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నిష్పక్షపాత పరిపాలన వల్లే ఈ రోజు ఇంతటి గెలుపు సాధ్యమైందన్నారు. గత […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: బద్వేలు నియోజకవర్గ ప్రజలకు వైసీపీ అభ్యర్థి డా. దాసరి సుధ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉపఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు.
వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నిష్పక్షపాత పరిపాలన వల్లే ఈ రోజు ఇంతటి గెలుపు సాధ్యమైందన్నారు. గత ఎన్నికల ఫలితాలకంటే డబుల్ మెజారిటీ ఇచ్చారని ఇందుకు కృతజ్ఞరాలినన్నారు. తనకు టికెట్ ఇచ్చిన సీఎం జగన్‌కు తన గెలుపులో కీలక పాత్ర పోషించిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేశ్, మాజీ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరికీ పాదాభివందనం చేశారు.
Next Story






