కస్టమర్లకు పాన్ తినిపిస్తున్న ‘మాము’ పాన్‌వాలా!

by  |
Paanwale Bhaiya
X

దిశ, ఫీచర్స్: పాన్ షాప్‌నకు వెళ్లి మీరు ఓ స్వీట్ పాన్ కావాలని అడిగారనుకోండి! తాజాగా మీ ముందరే పాన్ తయారు చేసి, దానిపై రోజ్ వాటర్ స్ప్రే చేసి, ఎంచక్కా మీ నోటికి అందించడమే కాకుండా, తమ షాప్‌కు వచ్చినందుకు థాంక్స్ చెప్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన మాము పాన్‌వాలే భయ్యా ఇలాంటి వినూత్న కార్యక్రమంతో ఆకట్టుకుంటున్నాడు. నాగ్‌పూర్‌లో ‘మాము పాన్ షాప్’ నడుపుతున్న తను వినియోగదారులను ఆకర్షించడం కోసమే ఇలా స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు తమ షాప్‌కు వచ్చిన కస్టమర్‌ను బాగుండాలని కోరుతూ మాము ప్రార్థన కూడా చేస్తున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ఇన్‌స్టా వేదికగా షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూనిక్ స్టైల్‌లో పాన్ తినిపిస్తూ, కస్టమర్ బాగుండాలని కోరుకునే మాముపాన్ షాప్‌కు తాము కూడా వస్తామని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వీడియోకు లైక్స్ కొడుతూ ‘మాము’ను ప్రశంసిస్తున్నారు.


Next Story

Most Viewed