క్లీన్ మొబైల్ వాష్‌‌‌రూమ్స్ ఘనత ఆమెదే!

by  |
Clean Washrooms
X

దిశ, ఫీచర్స్: పట్టణ ప్రాంతాల్లో శుభ్రమైన వాష్‌రూమ్‌ను కనుగొనడం చాలా మందికి, ముఖ్యంగా మహిళలకు కష్టమైన పని. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు పబ్లిక్ టాయిలెట్స్ గణనీయ సంఖ్యలో ఉన్నప్పటికీ, నిర్వహణ లోపం కారణంగా మహిళలు ఈ ఫెసిలిటీస్ ఉపయోగించుకునేందుకు సంకోచిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగానే నగరానికి చెందిన ఇన్నోవేటర్ సుష్మా కాలెంపూడి.. ‘మొబైల్ షీ టాయిలెట్స్’‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

పబ్లిక్ ప్లేసుల్లో ‘టాయిలెట్స్’ నిర్మించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు కలిపినా మెరుగైన పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు నిరంతర సమస్యగానే కనిపిస్తోంది. నగరంలో అనేక పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ డేటా రుజువు చేస్తున్నప్పటికీ.. మెయింటెనెన్స్ లోపం, సౌకర్యాల లేమి సమస్యలు వెంటాడుతున్నాయి. సుష్మ మొదట్లో మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేయాలని భావించారు. అయితే అనేక ఎన్‌జీవో‌లు ఆ పని చేస్తుండటంతో ఆమె ‘మొబైల్ టాయిలెట్స్’ కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది. తాను డిజైన్ చేసిన ప్రాజెక్ట్ కోసం నిధులను సేకరించేందుకు ఒక బ్లూప్రింట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC), కార్పొరేట్ సీఎస్‌ఆర్ వింగ్స్‌కు అందించింది. ఆలోచన బాగుండటంతో TSRTC, GHMCకి చెందిన పాత వాహనాలు పోర్టబుల్ వాష్‌రూమ్‌లుగా మారిపోయాయి. ఈ మేరకు ప్రస్తుతం అనేక ఫంక్షనల్ మొబైల్ పబ్లిక్ టాయిలెట్స్ నగరంలో తిరుగుతున్నాయి.

సుష్మ భర్త సుధీర్ ఎలక్ట్రిక్ వాహనాల మాన్యుఫ్యాక్చరింగ్‌లో పని చేస్తుండటంతో ‘మొబైల్ షీ టాయిలెట్స్’ కోసం ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను నిర్మించారు. ఒక్కో వాహన తయారీకి రూ. ₹ 4 లక్షలు ఖర్చు కాగా.. అందులో వాష్‌రూమ్‌తో పాటు ఫ్లష్, వాష్‌బేసిన్‌,100 లీటర్ల కెపాసిటీ ట్యాంక్, ఎగ్సాస్ట్ సిస్టమ్, హ్యాంగర్, మిర్రర్‌ వంటివి ఉంటాయి. అంతేకాదు ఇంందులోనే జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు, డైపర్ మార్చే స్టేషన్‌లు, శానిటరీ న్యాప్‌కిన్ డిస్పెన్సర్‌, పవర్ ఛార్జింగ్ సాకెట్‌లను ఇన్‌స్టాల్ చేయాలని యోచిస్తోంది. మొబైల్ షీ టాయిలెట్లకు మహిళల నుంచి సానుకూల స్పందన వస్తుండగా, గత నివేదికల ప్రకారం 350 పబ్లిక్ టాయిలెట్లలో 230 వరరకు సులభ్ నిర్వహిస్తోంది. ఇందులో 97 పాత టాయిలెట్స్ ఉండగా.. ‘లూ కేఫ్‌లు’ ప్రధానంగా హైటెక్ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో 34 షీ-టాయిలెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.


Next Story

Most Viewed