రాజభోగాల నడుమ పిల్లి.. సెపరేట్‌గా లివింగ్ రూమ్!

by  |
cat
X

దిశ, ఫీచర్స్ : పెంపుడు జంతువుల యజమానులు తమ ఫర్‌బేబీలను ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటారు. వాటి కంఫర్ట్ కోసం అన్ని ఏర్పాట్లను చేస్తూ, మంచి ఆహారం అందిస్తుంటారు. ఈ క్రమంలో పెట్స్ ఆరోగ్యం పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటూ వాటి సంతోషం కోసం అనువైన బొమ్మల్ని కూడా తీసుకొస్తుంటారు. అంతేకాదు ఇటీవల కాలంలో పెట్స్‌‌కు బారసాల, నేమింగ్ సెర్మనీ, వెడ్డింగ్ ఫొటో షూట్స్, వెల్‌కమింగ్ పార్టీలు చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తమ పెట్ యానిమల్స్‌ను ఇంట్లో సభ్యులతో సమానంగా ట్రీట్ చేస్తున్నారు. తాజాగా ఓ యజమాని ఎవ్వరూ ఊహించని విధంగా తన పెంపుడు జంతువు కిట్టీకి అద్భుతమైన గదిని ఏర్పాటు చేశాడు.

పిల్లికి ప్రత్యేక గదిని ఏర్పాటుచేసిన ఓ ట్విట్టర్ యూజర్.. ఆ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గది మొత్తాన్ని ఫ్లవర్ బొకేలతో ఎంతో అందంగా అలంకరించినట్టు ఆ ఫొటోలను చూస్తే తెలుస్తోంది. అంతేకాదు కిట్టీ నిద్రపోయేందుకు ప్రత్యేకమైన సోఫా, రగ్గులతో పాటు గది గోడలపై దాని ఫోటోలతో ఓ గ్యాలరీనే ఏర్పాటు చేశాడు. ఈ సూపర్ డూపర్ లివింగ్ రూమ్‌ను కలిగిఉన్న కిట్టీ పేరు ‘హమ్మీ’ కాగా, హుమన్ లీహ్ ఒకేసన్ దాని మజమాని. ఇప్పుడు హమ్మీ లివింగ్ రూమ్ ఫొటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ట్వీట్‌ను ఇప్పటివరకు 6 లక్షల మంది లైక్ చేయగా, లక్షమందికి పైగా రీట్వీట్ చేశారు. ఇక వైరల్ అవుతున్న ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు.. తమ ఇళ్లలో పెంపుడు జంతువులకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారో తెలుపుతూ ఫోటోలు షేర్​ చేస్తున్నారు. ఈ మేరకు కొందరు నెటిజన్లు.. తమకన్నా పిల్లి లైఫ్ ఎంతో లగ్జరీగా, ఆనందంగా ఉందని కామెంట్ చేస్తుండటం విశేషం.


Next Story

Most Viewed